బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సీపీఎం అభ్యర్థుల విజయానికి విస్తృత ప్రచారం

55 నిమిషాల క్రితం

cpm .jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 10:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అరుణోదయ కాలనీలో ప్రచారం నిర్వహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్

ప్రజాశక్తి – అనంతపురం : అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం అరుణోదయ కాలనీలోని 62వ డివిజన్‌ సీపీఎం కార్పొరేటర్‌ అభ్యర్థి ఏ గుల్జార్‌ విజయాన్ని కాంక్షిస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్‌ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి అభ్యర్థికి విశేష మద్దతు లభించింది. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన గుల్జార్‌ను ఈసారి తప్పకుండా గెలిపించుకుంటామని డివిజన్‌ ప్రజలు, మహిళలు పెద్దఎత్తున మద్దతు తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సీపీఎం తరఫున 60, 62, 25వ డివిజన్లలో పోటీ చేస్తున్న కార్పొరేటర్‌ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి వి. రామిరెడ్డి, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు రాజమోహన్‌, కేవీపీఎస్‌ నాయకులు వెంకటేష్‌, ఐద్వా జిల్లా కార్యవర్గ సభ్యురాలు శైలజ, ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్‌ నాయకులు లతీఫ్‌, సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్