ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాజ్యాంగ నిర్మాత , భరతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచితంగా వ్యవహరిస్తున్న హమారా ప్రసాద్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని దళిత, బహుజన, ఫూలే-అంబేద్కర్ వాదులు డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ని, రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానిస్తూ, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్న ప్రసాద్ నగులపు హమారా ప్రసాద్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ .... దళిత, బహుజన, ఫూలే-అంబేద్కర్ వాదులు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజయనగరం స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద ఫూలే అంబేద్కర్ వాదులు దళిత బహుజన సంఘాల నాయకులు అందరూ కలిసి హమారా ప్రసాద్ తీరును తీవ్రంగా ఖండించారు. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ, కులాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో అందరూ కలిసి హమారా ప్రసాద్ చిత్రపటాన్ని కాల్చి వారి నిరసనను తెలియజేశారు. నిరసన అనంతరం అంతా కలిసి నేరుగా విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా తరలివెళ్లారు.
అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ తీరుపై నిరసన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 03:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)