ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుంచి ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం లో పాల్గొన్నారు . జేఏసీ నేతలు మాట్లాడుతూ రెండు నోషనల్ ఇంక్రిమెంట్స్,ఆరు సంవత్సరాల పూర్తి చేసుకున్న ప్రతి ఒక ఉద్యోగికి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీం కల్పించాలనీ కోరారు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులలో పే స్కేల్ 30 వేలు తగ్గకుండా పదోన్నతులు కల్పించాలనీ అన్నారు గ్రామ వార్డు సచివాల ఉద్యోగి మరణిస్తే కారుణ్య నియామకం మూడు నెలల లోపల జరగాలని ఉద్యోగుల ఆత్మగౌర సమస్య అయినా జీవో నెంబర్ 11ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. బి ఎల్ వో విధులు ఎన్నికల కమిషన్ సూచన మేరకు 14 శాఖలలో ఉన్న ఉద్యోగులు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున చలో కలెక్టరేట్ ప్రోగ్రాం కూడా నిర్వహిస్తామని కూడా సంఘ నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డి సుధాకర్, లక్ష్మీనారాయణ, చిన్నూరప్ప, మల్లికార్జున, వరప్రసాద్, వీరనారప్ప, శివ శంకరయ్య, , వినయ్, తిప్పేస్వామి, హనుమంతు, మహేష్ నాయక్ రవికుమార్ నరపరెడ్డి, ధనుంజయ , రవితేజ, మౌలాలమ్మ, దుర్గా దామోదర్ రెడ్డి, శంకర్ రెడ్డి,శ్రీకాంత్.హరి, కిషోర్ కుమార్, లక్ష్మీకాంత్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణ వార్డు సచివాలయం ఉద్యోగుల నిరసన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 04:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)