సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నా భూమికి రక్షణ కల్పించాలి : విశ్రాంత ఆర్మీ

1 గంట క్రితం

Protection must be provided for my land: Retired Army personnel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 04:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తనకు ప్రభుత్వం మంజూరు చేసిన సాగు భూమిని ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ విశ్రాంత ఆర్మీ ఉద్యోగి నల్లూరి గణేష్‌ బాబు సోమవారం జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. తన భూమికి హద్దులు నిర్ణయించి రక్షణ కల్పించాలని కోరారు.గణేష్‌ బాబు మాట్లాడుతూ 1995లో అప్పటి ప్రభుత్వం మాచవరం మండలం పిల్లుట్ల గ్రామం లోని సర్వే నంబర్‌ 324-1బి2ఏ లో 5 ఎకరాల సాగు భూమికి పట్టా మంజూరు చేసింది. అప్పటి నుంచి ఆ భూమిని తానే సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నానని తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన జల్లా హనుములు కుమారుడు లక్ష్మయ్య తన భూమికి సమీపంలో ఉన్న ఎకరా భూమిని కబ్జా చేసి, హద్దులు ఏర్పాటు చేసుకుని ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గత ఆరు నెలలుగా రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1995లో తనతో పాటు మరో విశ్రాంత ఆర్మీ ఉద్యోగికి కూడా ప్రభుత్వం ఐదేసి ఎకరాల భూమిని మంజూరు చేసిందని, సదరు ఇదే వ్యక్తి ఆ భూమిలోనూ రెండు ఎకరాలను ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. విశ్రాంత ఆర్మీ ఉద్యోగుల భూములకు రక్షణ లేకుండా పోతుందని గణేష్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా తక్షణమే భూమికి హద్దులు నిర్ణయించి, సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని ఆక్రమణతో పాటు దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు సంబంధిత అధికారులను ఆదేశించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్