సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - "గోల్డ్ స్పాట్" మూవీ గ్లింప్స్ రిలీజ్

1 గంట క్రితం

gold spot movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 04:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న "గోల్డ్ స్పాట్" మూవీ గ్లింప్స్ రిలీజ్


హైదరాబాద్ బ్యూరో : ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న కొత్త మూవీ "గోల్డ్ స్పాట్". ఈ చిత్రాన్ని విజయకృష్ణ లింగమనేని ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుష్యంత్ దగ్గర వర్క్ చేసిన వేణు కార్తికేయన్ "గోల్డ్ స్పాట్" సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ రోజు మేకర్స్ "గోల్డ్ స్పాట్" సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.


"గోల్డ్ స్పాట్" సినిమా గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే - హీరోయిన్ తన ప్రాణానికి ప్రాణమైన తన స్నేహితుడు రామ్ గురించి చెబుతూ ఈ టీజర్ ఆసక్తికరంగా మొదలువుతుంది. 'అమ్మను చిన్నప్పుడే తీసుకువెళ్లిపోయిన ఆ దేవుడే, నాకు రామ్ ను పరిచయం చేశాడంటూ.. హీరోయిన్ చెప్పడం ఆమె అతన్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలియజేస్తోంది. 'మనకు జీవితంలో ఎంతోమంది పరిచయమవుతుంటారు. కానీ ఒక్కరే జీవితంగా మారిపోతారు..' అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ హార్ట్ టచింగ్ గా ఉంది. ఎమోషనల్ డెప్త్ ఉన్న ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఈ చిత్రంలో చూడబోతున్నట్లు గ్లింప్స్ తో తెలుస్తోంది.


ఇప్పటికే రిలీజ్ చేసిన "గోల్డ్ స్పాట్" టైటిల్ పోస్టర్ మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా గ్లింప్స్ కూడా చూడగానే ఆకట్టుకుంటోంది.


నటీనటులు - అభిషేక్, కాజల్ చౌదరి, తదితరులు


టెక్నీషియన్స్

-------------------

స్టంట్స్ - ఎం.హరికృష్ణ

కాస్ట్యూమ్ డిజైనర్ - పొలసాని శ్రీ సింధు

సౌండ్ డిజైన్ - సాయి మణీందర్ రెడ్డి

ఎడిటర్ - నరేష్ అడుపా

ప్రొడక్షన్ డిజైనర్ - పవన్ కల్యాణ్ యల్లపు

డీవోపీ - మహీ రెడ్డి

మ్యూజిక్ - నరేన్ రెడ్డి

కో ప్రొడ్యూసర్ - శ్రీ చౌదరి ఇనగంటి

సమర్పణ - విజయ్ కృష్ణ లింగమనేని

ప్రొడ్యూసర్ - రవితేజ పచ్చిపాల

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - దుష్యంత్ కటికనేని

డైరెక్షన్ - వేణు కార్తికేయన్

పీఆర్ఓ - సురేష్ (ఎస్ కే మీడియా)


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్