రోలుగుంట (అనకాపల్లి) : ' డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ బాబూ ... మా గ్రామానికి మంచినీరివ్వండి.. శాశ్వత పరిష్కారాన్ని చూపండి ` అంటూ ... ఫ్లోరైడ్ గ్రామస్తులు విన్నవించుకున్నారు. సోమవారం రోలుగుంట ఎస్ టి ఎస్సీ బీసీ మహిళలు ఖాళీ బిందెలను పట్టుకొని నిరసన తెలిపారు. తమది ఫ్లోరైడ్ గ్రామం అని తెలిపారు. తమ గ్రామానికి మంచి నీరు పంపండి అని నినదించారు. ఈ ఆందోళన మీడియాలో వైరల్ అవ్వడంతో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుండి ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులకు రోలుగుంట ఎస్సీ, ఎస్టీ బీసీ కాలనీకి తక్షణమే ఐదు లక్షల రూపాయల విలువ చేసే పనులు చేపట్టాలని ఆదేశాలొచ్చాయి. దీనితో ప్రజా సంఘాలు, స్థానిక మహిళలు మాట్లాడుతూ .... మంచినీటి సమస్య తమను సగం గట్టెక్కించే అవకాశాలు ఉన్నాయని, శాశ్వత సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని స్థానిక మహిళలు, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.









కామెంట్‌లు (0)