ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం విజయనగరం కోట జంక్షన్ వద్ద డీఎస్సీ అభ్యర్థులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని, జిల్లాల వారీగా ఖాళీలకు అనుగుణంగా పోస్టులు కేటాయించాలని, సింగిల్ పేపర్ విధానం అమలు చేయాలని, పరీక్షల్లో నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాల వల్ల వయోపరిమితి కోల్పోయిన నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా గరిష్ఠ వయోపరిమితిని 49 సంవత్సరాలకు పెంచాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం స్పెషల్ ఎడ్యుకేషన్ 2,260 పోస్టులను భర్తీ చేయాలని, ఇంటర్, డిగ్రీ అర్హత శాతాల్లో గతంలో ఉన్న నిబంధనలను కొనసాగిస్తూ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. డీఎస్సీ అనేది లక్షలాది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని, సంవత్సరాల తరబడి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంని కలిసి అభ్యర్థుల సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం అభ్యర్థుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
‘మా సమస్యలను పరిష్కరించండి’ : డీఎస్సీ అభ్యర్థుల నిరసన
20 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026, 04:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)