బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందన

1 గంట క్రితం

Response to the news in Prajashakti daily
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 04:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిన వార్తకు అధికారుల నుండి స్పందన వచ్చింది. వేపాడ మండలం జగ్గయ్యపేట గ్రామంలో లెక్కల దేవుడమ్మ ఇంటి వద్ద ఉన్న డ్యామేజీ విద్యుత్ స్తంభాన్ని మార్చాలని, అదేవిధంగా ఇంటి పైభాగం నుండి డైరెక్ట్ విద్యుత్ వైర్లు రైస్ మిల్క్ వేయడం వలన ఏమాత్రం వర్షం వచ్చినా గోడలను తాకితే కరెంట్ షాక్ వస్తుందని అక్కడి స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజాశక్తి దినపత్రికలో వార్త వచ్చింది. ఎలాంటి ప్రమాదం జరగకముందే డ్యామేజీ అయిన విద్యుత్ స్తంభాన్ని మార్చి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ .... ప్రజాశక్తి దినపత్రిక స్థానిక విలేకరి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళగా అధికారులు వెంటనే స్పందించి డ్యామేజీకి గురైన స్తంభాన్ని మార్పు చేశారు. దీంతోపాటు కొత్త విద్యుత్ స్తంభాన్ని కూడా బుధవారం ఏర్పాటు చేసినందుకు ఏడి, ఏఈ సిబ్బందికి దేవుడమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్