ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : ఆదివారం స్థానిక కోరుకొండ, విజయనగరంలో గల ద వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని పురష్కరించుకొని స్పోర్ట్స్ కార్నివాల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కార్నివాల్) వివిధ రకాలైన 60 ఆటలను ఆడించారు. ఈ కార్యక్రమములో విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టరు టి. వీరాస్వామి, పాఠశాల ప్రిన్సిపాల్ బి. లక్ష్మణ మూర్తి లు ప్రారంబించారు. డైరెక్టరు వీరాస్వామి మాట్లాడుతూ .. ‘‘ఆటలు మన గెలుపును మాత్రమే కాదు, ఓటమిని గౌరవంగా స్వీకరించే గొప్ప మనస్తత్వాన్ని కూడా నేర్పిస్తాయి" అని అన్నారు. అలాగే పాఠశాల -చైర్మన్ శ్రీ. సీతయ్య మాట్లాడుతూ.. పాఠశాల తక్ష్యం మంచి విద్యార్థులను తయారు చేయడం మాత్రమే కాదని, మంచి వ్యక్తిత్వం కలిగిన బావి పౌరులను తీర్చిదిద్దడమని, మరీ ముఖ్యంగా ‘‘చదువుల్లో ప్రతిభ, క్రీడల్లో పట్టుదల, జీవితంలో క్రమశిక్షణ" - ఈ మూడింటి సమన్యయమే సంపూర్ణ విద్య అని అన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ బి.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక దృడత్వాన్ని కూడా పెంపొందిస్తాయని అన్నారు. గెలుపు సాదించినపుడే విజయం, ఓటమి పాలైనప్పుడు పట్టుదల, పోటీల్లో పాల్గొన్నప్పుడు క్రీడా స్పూర్తి అలవడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన 50 రకాల వివిద ఆటలను విద్యార్థులతో పాటు వారి తల్లులతో ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమమలో వైస్ ప్రిన్సిపల్ స్వప్న, శ్రీమతి సుబాషిణి, వ్యాయామ ఉపాధ్యాయుడు సత్యన్నారాయణ, వ్యాఖ్యాతగ శశిభూషణరావులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో స్పోర్ట్స్ కార్నివాల్
15 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 15, 2026, 03:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)