ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఏ ఐ ఎఫ్ టి యు న్యూ అనుబంధ ఆటో యూనియన్ జిల్లా మహాసభలు సెప్టెంబర్, 6 న మేసానిక్ టెంపుల్ లో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు ఎన్.అప్పలరాజు రెడ్డి, రెడ్డి నారాయణరావు లు పిలుపునిచ్చారు. గురువారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభ గోడ పత్రికను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ మహాసభలకు సుమారు 10 మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లు ఈ జిల్లామహాసభలో పాల్గొంటారన్నారు. 1997 నుండి సెప్టెంబర్ 6 వరకు చేసిన విరోచితమైన పోరాటాలు జరిపి 2004 లో ఆనాటి ప్రభుత్వం హైవేరోడ్డు ఆటో టచ్ చేయకూడదంటే 24 గంటలు ఆటో బంద్ చేసి విజయం సాదించుకోవడం జరిగిందన్నారు. రోజుకి రు 50 లు తోపాటు 8 వ క్లాస్ ఉంటే గాని బ్యాడ్జీలు ఇవ్వడం జరగదంటే ఆటో లు బందు చేసి విజయవంతం చేసుకోవడం జరిగింది .అంతే కాకుండా జిల్లాలో ఆర్టీవో , గాని పోలీస్, ఆర్టీసీ స్క్వైడ్, పేరుతో జరిగే వేధింపులకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ కేసులు, నిర్భంధాలను ఎదుర్కొంటూ, ఈనాటికి పోరాటాలు చేస్తూ నిరంతరం డ్రైవర్ల పక్షాన నిలబడుతూ వస్తున్న క్రమములో జిల్లా మహాసభలు జరిపి తద్వారా భవిష్యత్ కార్యక్రమాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు లు కారణంగా 80% ఉపాధి కోల్పోవడం జరిగిందన్నారు. ములూగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాపిడో ఓలా ఓబర్ లాంటి బహుళజాతి కంపెనీలకు అనుమతులు ఇవ్వడం వలన బైక్ ఆటో లు వచ్చిన తరువాత మా ఉపాధి పోతుందన్నారు.ఒక పక్క ఫ్రీ బస్సు మరోపక్క రాపిడో, ఓల ఓబర్ లు వచ్చి జీవించకుండా చేస్తన్న పాలకల విధానాలకు వ్యతిరేకంగా ఆటో కార్మికులను ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ పోరాటాలకు సిద్దపడటానికి ఉపయోగ పడతాయని ఇంకా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసుకోనే విదంగా చర్చించడం జరుగుతుందన్నారు. కాబట్టి సెప్టెంబర్ 6న జరిగే మహాసభలను ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు .ఈ సమావేశం లో జిల్లాకమిటి సభ్యులు చెన్నా ధర్మారావు, కంది రాము, తర్లడా శ్రీధర్, గేదెల నారాయణరావులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 6న శ్రీ విజయదుర్గ ఆటో యూనియన్ మహాసభ
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 06, 2026, 01:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)