ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ సైన్స్ సెమినార్‌లో రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థి

1 గంట క్రితం

Adarsh ​​School student excels at state level in National Science Seminar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడ మండలం బక్కునాయుడుపేట ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎం. అరవింద్ 2026 జాతీయ సైన్స్ సెమినార్‌లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని మొదటి ఐదు స్థానాల్లో నాలుగో స్థానం సాధించి సత్తా చాటాడు.


వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా “ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047 – ప్రాస్పెక్ట్స్ అండ్ ఛాలెంజెస్” అనే అంశంపై సైన్స్ సెమినార్ నిర్వహించారు. 2047 నాటికి సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ వంటి స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ రావాడ ఈశ్వరరావు తెలిపారు.


విద్యార్థులను ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 15న పాఠశాల స్థాయిలో నిర్వహించిన సెమినార్‌లో ఎం. అరవింద్, జి. పద్మశ్రీజ మండలస్థాయికి ఎంపికయ్యారు. అనంతరం సెప్టెంబర్ 16న నిర్వహించిన మండలస్థాయి సెమినార్‌లో ఎం. అరవింద్ ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపికయ్యాడు.


జిల్లాస్థాయిలో వివిధ మండలాల నుంచి 47 మంది విద్యార్థులు పాల్గొనగా, ఎం. అరవింద్ ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 30న విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సెమినార్‌లో రాష్ట్రంలోని 27 జిల్లాల నుంచి 54 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ఎం. అరవింద్ మొదటి ఐదు స్థానాల్లో నాలుగో స్థానం సాధించి ప్రతిభను చాటాడు.


రాష్ట్రస్థాయిలో ఘన విజయం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చిన ఎం. అరవింద్‌ను పాఠశాల ప్రిన్సిపల్ రావాడ ఈశ్వరరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. అలాగే విద్యార్థిని ప్రోత్సహించి, మార్గనిర్దేశం చేసిన సైన్స్ ఉపాధ్యాయులు శ్రీమతి బేబీ రాణి, శ్రీమతి విజయ, శ్రీ వరప్రసాదరావు, శ్రీమతి నాగజ్యోతి, శ్రీ రామకృష్ణారావులను అభినందించారు. భవిష్యత్తులో కూడా అరవింద్ మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్