ప్రజాశక్తి–విజయనగరం టౌన్ : విజయనగరం పట్టణంలోని ప్రభుత్వ మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి యు. మాణిక్యం నాయుడు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా ప్రగతి, పరీక్షల సన్నద్ధత గురించి అడిగి తెలుసుకున్నారు. మిషన్ మార్చ్ లక్ష్యంగా పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులంతా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధన సాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. లలితకుమారి, సీనియర్ ఉపాధ్యాయులు వై. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: డీఈఓ
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 11:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)