బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి : ఏపిటిఎఫ్ డిమాండ్

1 గంట క్రితం

TET for in-service teachers must be scrapped: APTF demands
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 04:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ఎన్.వి. పైడిరాజు ప్రధాన కార్యదర్శి గంట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డి ఈశ్వరరావు ప్రసంగిస్తూ తేదీ 24.8. 2026న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ఇన్ సర్వీస్ టీచర్స్ కి స్పెషల్ టేట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో డీఎస్సీ అభ్యర్థులకు ఏ విధంగా అయితే టెట్ ఉందో అదే విధంగా ఇన్ సర్వీస్ టీచర్స్ కి టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏపీటీఎఫ్ పరంగా మరియు ఉపాధ్యాయ సంఘాలుగా ఇన్ సర్వీస్ టీచర్స్ కి టెట్ రద్దు చేయాలని అది సాధ్యం కాని పక్షంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు వారు బోధిస్తున్న సబ్జెక్టు మీద మాత్రమే టెట్ నిర్వహించాలని కోరడం జరిగింది. ప్రభుత్వం విద్యాశాఖ పరిశీలిస్తామని చెప్పి డీఎస్సీ అభ్యర్థులకు ఏదైతే టెట్ నోటిఫికేషన్ ఇస్తారో అదే తేదీ మార్చి ఇవ్వడం జరిగింది. దీనిపై ఇన్సర్వేస్ ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు. కావున ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని ఏదైతే ఉపాధ్యాయ సంఘాలు సూచనలు చేశాయో ఆ సూచనలు ఆధారంగా టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.


టెట్ రద్దు చేయాలనీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి....

ఉపాధ్యాయులు బోధిస్తున్న సబ్జెక్టుపై మాత్రమే టెట్ నిర్వహించాలి ,టెట్ పరీక్ష పాస్ మార్క్ కులాలతో సంబంధం లేకుండా 40 శాతం ఉండాలి. ,టెట్ పరీక్ష సి బి టి పద్ధతిలో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించాలి, టెట్ పరీక్షకు సమయం తక్కువ ఉన్నది కనుక డిసెంబర్లో నిర్వహించాలనీ డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ ఏ సదాశివరావు జిల్లా గౌరవ అధ్యక్షులు ఆర్ కృష్ణ అధ్యక్షులు ఎన్.వి పైడిరాజు ప్రధాన కార్యదర్శి గంట సత్యనారాయణ పార్వతిపురం మన్యం జిల్లా అధ్యక్షులు మజ్జి శేషగిరిరావు ప్రధాన కార్యదర్శి శ్రీపి కూర్మినాయుడు జిల్లా గౌరవ సలహాదారులు ఎం బలరాం నాయుడు ఎన్ శ్రీదేవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి వెంకట్ నాయుడు, వై మధుసూదన్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు ఏవి శ్రీనివాసరావు, సిహెచ్ రామారావు, జిల్లా కార్యదర్శి పి.దామోదర్ నాయుడు, ఎన్ సూర్యనారాయణ శ్రీమతి ఎన్ చిన్నాదేవి , మాతా రామకృష్ణ ,కే త్రినాధ రావు జిల్లా సబ్ కమిటీ సభ్యులు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్