మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆటో,క్యాబ్ డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

1 గంట క్రితం

vzm-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 02:23 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఊబర్, ఓలా, రాపిడో ల ను రద్దు చేయాలి.

విజయనగరం జిల్లా ఆటో & మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజయనగరం జిల్లా ఆటో & మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఉబర్ ఓలా,రాపిడోలను రద్దుచేసి ప్రభుత్వమే యాప్‌ను తీసుకురావాలని, శ్రీ శక్తి పథకంతో నష్టపోయిన డ్రైవర్లకు తక్షణ సాయం కింద 20,000 ప్రకటించాలని కోరుతూ విజయనగరం జిల్లా ఆటో & ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ (సి ఐ టి యు) ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ఏవో ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ గేటు వద్ద ధర్నాకు అనుమతించక పోవడంతో కంటోన్మెంట్ పార్కు వద్ద ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి ఏ. జగన్మోహన్రావు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ సంస్థల లాభాల కోసం పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ఆటో, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టి ఉబర్, ఓలా, రాపిడో సంస్థలకు అనుమతులతో పాటు పార్కింగ్ స్థలాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వైట్ బోర్డు వాహనదారులు సైతం యాప్‌ ద్వారా పాసింజర్ సర్వీస్ చేస్తున్నారని, వాటిని నియంత్రించాలన్నారు. శ్రీ శక్తి పథకం తో నష్టపోతున్న ఆటో క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం రూ 20,000/- లు ప్రకటించాలన్నారు. ఫీజులు, పెనాల్టీలు, చలానాలు పెంచుతూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, 2023, 24 నుంచి పెండింగ్ లో ఉన్న ఈ చలానా కేసులు పూర్తిగా ఎత్తివేయాలని, క్యాబ్ లకు టోల్ చార్జీలు మినహాయింపు ఇవ్వాలని , ఒకే దేశం ఒకే పన్ను తరహాలో పెట్రోల్ డీజిల్ ను జిఎస్టి పరిధిలోకి తేవాలని, ఎల్లో బోర్డు వాహనాలకు రాయితీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేరళ, తమిళనాడు, బెంగాల్లో ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు అమల్లో ఉందని, కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రబాబు డబల్ ఇంజన్ సర్కార్ కాబట్టి తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా డ్రైవర్లకు ప్రమాద బీమా 10 లక్షలు, వైద్య ఖర్చులు, అనారోగ్య పాలైతే ఆర్థిక సహకారం, పిల్లలకు స్కాలర్షిప్, వివాహ, డెలివరీ కానుకలు, వాహనాల కొనుగోలుకు సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 1 ,2,3 తేదీల్లో ఆక్యుపై ఢిల్లీ చేపడుతున్నామని, డ్రైవర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి లక్ష్మి, కార్యదర్శి బి .రమణ, ఆటో యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ ముత్యాలు, నాయకులు పాపారావు, రామ నాయుడు, కూర్మారావు, ఈశ్వరరావు , లక్ష్మణరావు, డిఎల్ఎన్, సంతోష్, శివ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్