ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొమ్మాది కూడలిలో ట్రాఫిక్‌ రద్దీ

2 రోజుల క్రితం

కొమ్మాది కూడలిలో ట్రాఫిక్‌ రద్దీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 05:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

భోగాపురం ఎయిర్‌‌పోర్టు ఏర్పడిన తర్వాత కొమ్మాది కూడలిలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. కొమ్మాది జంక్షన్ సర్వీస్ రోడ్డు, రైతు బజార్, శివశక్తినగర్ రోడ్డు మార్గాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 11 గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. కొమ్మాది పెట్రోల్ బంక్ జంక్షన్ నుండి రైతు బజార్‌కు వెళ్లే దారిలో రోడ్లపైనే చిరు వ్యాపారాలు సాగించడం, రైతు బజార్‌కు వెళ్లేవారు రోడ్లపైనే తమ వాహనాలను ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ​గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ సమయాల్లో కనీసం ఒక్క ట్రాఫిక్ పోలీసు కూడా కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్