ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడ మండలంలో ఈ ఏడాది ఖరీఫ్ నువ్వు పంట 250 హెక్టార్లలో వేయడం జరిగిందని అక్కడి రైతులు మంగళవారం తెలిపారు. ముందుగా రుతుపవనాలు అనుకూలించడంతో రైతులు వేసిన నువ్వు పంటకు మేలు జరిగి బాగా పంట పండింది. పండిన నువ్వు పంటను కోసుకొని నువ్వులు దులుపుకొని ఇంటికి చేర్చుకునే పనుల్లో నువ్వు పంట వేసిన రైతులందరూ పొలాల్లో ఉన్నారు. ఇదే విధంగా రెండు మూడు రోజులు ఎడతెరుపు ఇస్తే పండిన పంట పూర్తిగా ఇంటికి చేర్చుకునే అవకాశం కలుగుతుందంటున్నారు నువ్వు పంట వేసిన రైతులు.
నువ్వు పంట రైతులు పొలాల్లో బిజీ బిజీ
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 07, 2026, 11:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)