ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ... రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏ లు మంగళవారం 7వ రోజు వీఆర్ఏలు అర్థ నగ్నంగా ప్రదర్శన నిర్వహించి రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు తలుపురి ముత్యాలరావు సిరికొండ సాయి రామకృష్ణ మాట్లాడుతూ ... టిడిపి కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మేరకు వేతనాలు ఇతర ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు కూరగాయలు వంటనూనె విద్యార్థుల విద్యాపీజీలు తదితర ఖర్చులతో కుటుంబాలు పోషించుకునేందుకు చాలా ఇబ్బందిగా మారుతుందని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉoదుర్తి పెద్ద రెడ్డియ్య, పద్మారావు, సత్యనారాయణ, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
7 వ రోజు - వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 12:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)