సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం
ప్రజాశక్తి-గణపవరం: ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని కోరుతూ మంగళవారం సిఐటియు గణపవరం మండల కమిటీ ఆధ్వర్యంలో నారాయణపురం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ ఎం. పెంటారావు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరారు. ఆశా వర్కర్లకు నాణ్యమైన సెల్ఫోన్లు అందించాలని, రూ.10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించి, యూనిఫాం అందజేయాలని డిమాండ్ చేశారు.స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల నియామకాలు చేపట్టాలని కోరారు. శిక్షణ పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలని, స్కీమ్ వర్కర్లందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు, కోర్కెల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు పి. వరలక్ష్మి, ఆర్. వెంకటరమణ, ఎం. శివదుర్గ, శ్రావంతి, ఎం. శాంతి, కృష్ణకుమారి, అరుణ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)