ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూటమి మేయర్ సీటుకు పోటీ అభ్యర్థులు ఎక్కువ : మంత్రి సత్య కుమార్

54 నిమిషాల క్రితం

Many candidates vying for the alliance's mayoral seat: Minister Satya Kumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 04:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

వైసీపీ టికెట్ అడిగే వారే లేరు : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వ్యాఖ్య

కూటమి మేయర్ సీటుకు పోటీ అభ్యర్థులు ఎక్కువ : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వ్యాఖ్య


ప్రజాశక్తి-అనంతపురం (కార్పొరేషన్) : అనంతపురం కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటుకు కూటమిలో పోటీకి అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. వైసిపి పార్టీ లో మేయర్ సీటుకు టికెట్ అడిగే వారే లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు కూటమిలో మూడు పార్టీల మధ్య చర్చల ప్రక్రియ ముగిసి అభ్యర్థులు ప్రకటించటం ఆలస్యమైందన్నారు అయితే కూటమి తరపున పోటీకి ఎక్కువ మంది ఉండటంతో అందరికీ సర్ది చెప్పి మూడు పార్టీలకు సీట్ల కేటాయింపు జరిపామన్నారు అందుకే అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైందని అన్నారు అయితే కూటమి పార్టీలలో పోటీకి అభ్యర్థులు ఎక్కువ ఉన్నారని చెప్పటం వరకు సరే కానీ ప్రతిపక్ష వైసిపి పార్టీకి మేయర్ టికెట్లు అడిగే వారే లేరని చెప్పటం ఓకింత విడ్డూరం అని చెప్పక తప్పదు ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి అభ్యర్థి అజయ్ నామినేషన్ కార్యక్రమానికి కూటమినేతలు మంది మార్బలంతో తరలివచ్చారు మంత్రి సత్య కుమార్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అహుడ చైర్మన్ వరుణ్ తదితర నేతలు మంది మార్బలంతో తరలివచ్చారు సప్తగిరి సర్కిల్ బారికేడ్లు అడ్డుగా పెట్టి నామినేషన్ కు వచ్చే అభ్యర్థులను ఒకరిద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తూ వచ్చిన పోలీసు యంత్రాంగం కూటమినేతల రాకతో గేట్లు బార్ల తీశారు బ్యారికేడ్లను దాటుకొని వారు కార్లతో మంది మార్బలంతో బిజెపి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియకు అనుమతించారు ఇతర ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల నామినేషన్ కు మాత్రం బ్యారికేడ్ల వద్ద వారి వెంట వచ్చిన వారిని నిలిపివేసి అభ్యర్థి వెంట ఇద్దరిని మాత్రమే అనుమతించారు వారి వాహనాలను కూడా పరిసర ప్రాంతాలలోకి రానీయకుండా చేశారు సప్తగిరి సర్కిల్ వద్ద డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు ఒక దశలో కొంతమంది పత్రిక విలేకరులను కూడా అనుమతించలేదు కొంతసేపు వేచి ఉండమని నిలిపివేశా రు దీనితో సప్తగిరి సర్కిల్ వద్దనే పత్రికా విలేకరులు డ్యూటీ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది అయితే రెండు గంటలు కావస్తున్న పోలీసు యంత్రాంగానికి ప్రత్యేకించి సప్తగిరి సర్కిల్ వద్ద డిఎస్పి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు భోజనం సరఫరా కాలేదు. దీనితో వారు ఆకలితో నకనక లాడారు మంది పోలీసులకు భోజనం అందనే లేదు మద్యాహ్నం 2.45 నిమిషాల సమయంలో వేణుగోపాల్ నగర్ నుంచి వి జితేంద్ర క్యాటరింగ్ వాహనంలో భోజనం ప్యాకెట్లు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రధాన గేటు వద్దకు చేరుకుంది నామినేషన్ల ప్రక్రియ గడువు ముగుస్తున్న సమయంలో వచ్చిన భోజనం ప్యాకెట్లను తీసుకోకుండానే పోలీసులు విధులు నిర్వహించటం కనిపించింది కోర్టు రోడ్డులో అర్బన్ ఎమ్మెల్యే కాన్వాయ్ 11 వాహనాలతో రావడం అదే సమయంలో వైసీపీ ర్యాలీ కొనసాగుతుండటంతో అక్కడ కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఆ ట్రాఫిక్ జామును తొలగించటం పోలీసులకు సవాల్ గా మారింది ఎన్నికల నిబంధన ప్రకారం ఏ ప్రజాప్రతినిధి అయిన ఒక్క వాహనానికి మించి వెళ్ళరాదని సూచిస్తున్న అధికారం ఉందన్న దర్పం చూపించటానికి పెద్ద ఎత్తున వాహన శ్రేణిని వెంట తీసుకెళ్తూ ఉండటం వారిని వారించలేక పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నికల నిబంధన వాలేని అతిక్రమిస్తున్న కూటమి నేతలకు ఒక చట్టం ప్రతిపక్ష పార్టీలకు మరొక చట్టం అమలు జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాలలో కొనసాగుతోంది


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్