ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు - 2026లో భాగంగా నామినేషన్ల ప్రక్రియను ఆదివారం జిల్లా స్థానిక సంస్థల జనరల్ అబ్జర్వర్ బి.స్మరణ్ రాజ్, ఐ.ఏ.ఎస్ పరిశీలించారు. నగర పాలక సంస్థకు చేరుకున్న జనరల్ అబ్జర్వర్ కు కమిషనర్ స్వాగతం పలికారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియను జనరల్ అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుని, సజావుగా నామినేషన్ల ప్రక్రియ జరిగేలా నగర పాలక సంస్థ కమిషనర్ కు పలు సూచనలను జనరల్ అబ్జర్వర్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు, ఆర్ఓలు, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ లో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల పరిశీలకుడు
59 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 04:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)