రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం బయట ఏర్పాటు చేసిన బ్యారికెట్ల లోపల ప్రవేశించేందుకు ప్రయత్నించిన యువకుడికి పోలీసులకు వాగ్వివాదం జరిగింది. నామినేషన్ల సందర్భంగా ఎక్కువమంది గుంపుగుమి కూడకుండా ఉండేందుకు అధికారులు బారికెట్లు ఏర్పాటు చేశారు. బొమ్మనహల్ ఎస్సై నబీ రసూల్ అక్కడ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఒక యువకుడు బారికేడ్ల లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తన నివాసం మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉందని తాను తన ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని ఆ యువకుడు పోలీసులను కోరారు. అయితే నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నందున అభ్యర్థులు వారి వెంట ప్రతిపాదికులు మినహా ఇతరులు వెళ్లేందుకు వీలులేదని ఎస్ఐ చెప్పారు. తాను తన ఇంటికి వెళ్లేందుకు దారి చూపాలని ఆ యువకుడు ఎస్సైతో వివాదానికి దిగాడు. ఈ మార్గంలో అనుమతించేది లేదని ఎస్ఐ స్పష్టం చేశారు. తాను తన ఇంటికి వెళ్లేందుకు అనుమతించకపోతే ఎలా అని నిలదీశాడు. పోలీసులు అంగీకరించకపోవడంతో తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తా అని ఆ యువకుడు తెలిపాడు. తమ గత మూడు రోజులుగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బారికేడ్ల లోపల ప్రవేశంపై వాగ్వివాదం
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 04:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)