గణపవరం పోటో కేశవరం హైస్కూలుకి ప్యాన్సు అందచేస్తున్న జిల్లా అవార్డు గ్రహీత పి వి రమణి
ప్రజాశక్తి గణపవరం (పశ్చిమ గోదావరి) : ఉపాధ్యాయురాలుగా విద్యార్థులకు విద్య అందించటంతోపాటు వారికి సౌకర్యాలు కలగచేస్తున్న కేశవరం హైస్కూల్ తెలుగు టీచరు జిల్లా ఉత్తమ ఉపాద్యాయ గ్రహీత పి వి.రమణ చేస్తున్న కృషిని పలువురు ప్రశంసించారు. బుధవారం తన హైస్కూల్ కి చెందిన ఆరు, ఏడు తరగతి విద్యార్దులకు తరగతి గదులలో ప్యాను లు లేకపోవటంతో ఇబ్బందులు గమనించిన రమణి మూడు వేల రుపాయాలతో రెండు ప్యాన్సు స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ కి అందచేసారు. ఈ సందర్భంగా రమణి మాట్లాడుతూ ... విద్యార్థుల అభివృద్ది కి తన వంతు కృషిని అందచేస్తున్నట్లు చెప్పారు. రమణి అందచేసిన సహాకారాన్ని ఉపాధ్యాయులు అభినందించారు.







కామెంట్‌లు (0)