బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరు కావాలి : మున్సిపల్ కమిషనర్ పి.శ్రీహరి బాబు

50 నిమిషాల క్రితం

Voters who received notices must appear for the inquiry: Municipal Commissioner P. Srihari Babu.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 02:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్.ఐ.ఆర్-2026) కార్యక్రమంలో భాగంగా 'నో మ్యాపింగ్' 'అనామలీస్' సమస్యల పై నోటీసులు అందుకున్న పట్టణ ఓటర్లు ఈ నెల 11వ తేదీ (11. 09.2026) లోపు మున్సిపల్ కార్యాలయంలో జరిగే విచారణకు విధిగా హాజరుకావాలని సహాయ ఓటరు నమోదు అధికారి, మున్సిపల్ కమిషనర్ పి.శ్రీహరి బాబు ఒక ప్రకటనలో బుధవారం తెలి పారు. నోటీసులు అందుకున్నవారు తమ వెంట అవసరమైన ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలను తీసుకువచ్చి తమ ఓటు హక్కును తుది జాబితాలో ఖాయపరచుకోవాలని సూచించారు. నోటీసులు పొంది కూడా విచారణకు హాజరుకాని వారి ఓట్లను తుది ఓటర్ల జాబితా నుండి శాశ్వతంగా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఏవైనా సందేహాలు లేదా ఇతర సమాచారం కోసం సంబంధిత బూత్ లెవల్ అధికారులను (బీఎల్ఓ) సంప్రదించాలని కమిషనర్ కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్