బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఐ లవ్‌ యూ’ అంటూ మెసేజ్‌.. ప్రశ్నిస్తే ర్యాపిడో రైడర్‌ నిర్లక్ష్య సమాధానం ..!

1 గంట క్రితం

Message saying ‘I love you’... Rapido rider gives a dismissive reply when questioned!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 01:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నోయిడా : పార్సిల్‌ డెలివరీ చేసిన అనంతరం ఓ మహిళకు అనుచిత సందేశాలు పంపిన ర్యాపిడో రైడర్‌.. ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడంతో క్షమాపణలు చెప్పకుండా ఎదురుదాడికి దిగిన ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను బాధితురాలు లింక్డ్‌ఇన్‌లో వెల్లడించడంతో విషయం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.


నోయిడాకు చెందిన ఓ మహిళకు ర్యాపిడో ద్వారా పార్సిల్‌ అందించిన రైడర్‌.. డెలివరీ పూర్తయిన తర్వాత ఆమెకు వ్యక్తిగతంగా సందేశాలు పంపడం ప్రారంభించాడు. తొలుత ‘హలో.. ఎలా ఉన్నారు ?’ అని మెసేజ్‌ చేసిన అతడు.. కొద్దిసేపటికే ‘ఐ లవ్‌ యూ’ అంటూ మరో సందేశం పంపాడు. దీంతో అసౌకర్యానికి గురైన మహిళ ఇకపై తనను సంప్రదించవద్దని స్పష్టం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. అయితే ఆమె హెచ్చరికను రైడర్‌ పట్టించుకోలేదు. పైగా ‘ఫిర్యాదు చేసుకో.. ర్యాపిడోలోనే చేయి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను మహిళ సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశారు.


ర్యాపిడో రైడర్ల నియామక ప్రక్రియ, మహిళా ప్రయాణికులు, వినియోగదారుల భద్రతకు సంబంధించిన అంశాలపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై స్పందించిన ర్యాపిడో సంస్థ మహిళకు క్షమాపణలు తెలిపింది. వినియోగదారుల భద్రత, గౌరవానికి తమ సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంది. అయితే సంబంధిత రైడర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నదీ సంస్థ వెల్లడించలేదు. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్