ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి..

14 నవంబర్, 2026

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 06:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సామర్లకోట : బాల్య వివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ప్రముఖ న్యాయవాదులు పెండ్యాల ఏసుబాబు, ముమ్మిడి సత్తిబాబు, వక్కలంక రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఉండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం ఎం.కూర్మారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో న్యాయవాదులు ఏసుబాబు, సత్తిబాబు, రమేష్ కుమార్, జంగం సంతోష కుమారి మాట్లాడారు. విద్యార్థులు ముందుగా చట్టాలపై పూర్తి అవగాహన పొంది, ఇళ్లలో తమ తల్లిదండ్రులకు కూడా ఆయా చట్టాల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. బాలల హక్కులు, బాలల రక్షణ చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. సమాచార హక్కు చట్టం, వినియోగదారుల రక్షణ చట్టం, పోక్సో చట్టం నిబంధనలపై విద్యార్థులకు విపులంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ మల్లికార్జునరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్