పంట నష్టం వివరాలు సచివాలయాల్లో ప్రదర్శించాలి - -ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాలి
- ఆంధ్రప్రదేశ్ కౌలురైతులసంఘం జిల్లా కమిటీ డిమాండ్
ప్రజాశక్తి - భీమవరం (పశ్చిమ గోదావరి) : జిల్లాలో వరుస తఫాన్లుకు ఆరుగాల కష్టం సర్వం కోల్పోయిన వాస్తావ సాగుదారులైన కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. తుఫాన్లు దాటికీ దెబ్బతిన్న వరి పొలాలు కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు పరిశీలించి మాట్లాడారు. తుఫాన్ పంటనష్టం పరిశీలించేందుకు జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించామన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 1.95 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని అన్నారు. ముంపునీరు లాగే సరికి పంటనష్టం తీవ్రత మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి వాస్తావంగా పంటలు పండించే కౌలురైతులను క్షేత్ర స్థాయిలో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమలులో వున్నా కౌలుచట్టం నిబంధనలతో కౌలురైతులకు 60 శాతం వరకు గుర్తింపు కార్డులు అందడంలేదని, ఈ పంట భూయజమానుల పేరునే చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నత అధికారులు తక్షణం తగు చర్యలు తీసుకుని ఈ క్రాఫ్ లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చి కౌలురైతుల పేరున పంటనష్టం నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టం వివరాలు సచివాలయాల్లో ప్రదర్శించిన తరువాత తుది జాబితా తయారు చేయాలన్నారు. ఎకరాకు పంటనష్టం రూ. 30 వేల రూపాయలు ఇవ్వాలని, పంటలభీమా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కమిటీ సభ్యలు, కౌలురైతులు కేతా పూర్ణారావు, బండి సత్యనారాయణ, కేతా ఆదినారాయణ, కుడిపూడి శ్రీనివాస్, కట్టా నాగరాజు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)