ఖర్చు అంత తానే భరిస్తాను అని ప్రకటించిన కొండేపూడి సర్పంచ్ అభ్యర్థి సురేష్
ప్రజాశక్తి - పాలకోడేరు (పశ్చిమ గోదావరి) : పాలకోడేరు మండలం కొండేపూడి గ్రామ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తే వంతెన నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని అభ్యర్థి పాల సురేష్ ప్రకటించారు. కొండేపూడిలో స్మశానానికి వెళ్లాలంటే జి అండ్ వి కెనాల్ దాటి అవతలకు వెళ్లాలి. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియలు చేయాలంటే కత్తి మీద సామే. ఎంతో లోతు కలిగిన జి అండ్ వి కెనాల్ పైనుంచి నాటు పడవపై కాలువ దాటాల్సిన దుస్థితి ఉంది. గతంలో అనేకసార్లు ఇలా వెళుతున్న సమయంలో నాటు పడవలు బోల్తా పడి మృతదేహాలు గల్లంతైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కరించేందు కు సర్పంచ్ అభ్యర్థి పాల సురేశ్ వినూత్న హామీ ఇచ్చారు. తనను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేస్తే, వంతెన నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని ప్రకటించారు. గ్రామ ప్రజల దశాబ్దాల కష్టాన్ని తీర్చేందుకు ఆయన ముందుకు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సర్పంచ్ పదవి పట్ల తీవ్ర పోటీ ఏర్పడింది. అయితే ఏకాగ్రేవం ఎవరిని వివరిస్తుందో.. ఎవరు వంతెన నిర్మిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.







కామెంట్‌లు (0)