ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

3వ రోజు గ్రంథాలయ వారోత్సవాలు

6 రోజుల క్రితం

3వ రోజు గ్రంథాలయ వారోత్సవాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 05:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సిటీ : నగరంలోని సీతంపేట గ్రేడ్-1 గ్రంథాలయంలో అధికారి డి. వెంకటరమణ అధ్యక్షతన వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత గ్రంథాలయ ఉద్యమకారుడు అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు భీమయ్య, కళాదృష్టి వ్యవస్థాపకులు ఎ.కృష్ణశర్మ మాట్లాడుతూ మహనీయుల కృషి వల్లే నేడు గ్రంథాలయాలు అందుబాటులోకి వచ్చాయని కొనియాడారు. పుస్తకం మంచి స్నేహితుడని, పఠనం వల్ల విజ్ఞానం, మనశ్శాంతితో పాటు ఉద్యోగ సాధన సులభమవుతుందని వక్తలు, విద్యార్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానిక పాఠశాలల విద్యార్థులు, పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది డి. రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్