సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గోదావరి వరద పరిస్థితిపై జిల్లా కలెక్టర్ పరిశీలన

02 ఆగస్టు, 2026

District Collector reviews Godavari flood situation.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 01:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : గోదావరి వరద పరిస్థితి పై జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం  కోడేరు విశిష్ట గోదావరి పరీవాహక ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. భద్రాచలం వద్ద వరద తగ్గుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.. తాసిల్దార్ ఇతర శాఖ అధికారులు  ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. లంక గ్రామాల్లో త్రాగునీరు, విద్యుత్, వైద్య సేవలు  ఇతర అత్యవసర సౌకర్యాలకు అంతరాయం కలపకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆచంట మండలం అయోధ్య లంక,, పుచ్చలంక, మర్రి మూల, రాయిలంక, పెద్ద పేట, కోడేరు పల్లిపాలెం, పెదమల్లం లంక, ఆనగారలంక  ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా  చూడాలని సూచించారు. గోదావరి లంక గ్రామాల ప్రజలు  అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని  ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు  పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్