- సిఐ రజనీకుమార్
ప్రజాశక్తి-గణపవరం: స్థానిక ఎన్నికలు గ్రామాల్లో శాంతియుతంగా జరుపుకోవాలని నిడమర్రు సిఐ నక్కా రజనీ కుమార్ అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా బుదవారం గణపవరం పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన నామేనేషన్లు కేంద్రాన్ని గణపవరం ఎస్ఐ మణికుమార్ తో కలసి పరిశీలించారు. ఈసందర్భంగా రజనీకుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నామేనేషన్ వేయటానికి వచ్చిన అబ్యర్ది తోపాటు మరో ఇద్దరు మాత్రమే ఉండాలని అన్నారు. మిగిలిన వారు కేంద్రానికి వంద అడుగులు దూరంలో ఉండాలని చెప్పారు. ఈకార్యక్రామములోపంచాయతీ కార్యదర్శి డి ఎస్ ఆర్ ప్రసాద్ హెడ్ కానేస్టేబుల్ దాసరి ప్రసాద్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)