ప్రజాశక్తి - నరసాపురం: నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు మాటలతో విరుచుకుపడుతూ పరస్పరం సవాళ్లు విసురుకోవడంతో గ్రామంలో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు నరసాపురం డీఎస్పీ సుధాకర్‌రావు, ఆర్డీవో దాసిరాజు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించి, ఇరువర్గాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చిట్టవరం గ్రామంలో నెలకొన్న పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
చిట్టవరంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 09:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)