ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : భార్య కాపురానికి రాలేదని భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి గణపవరంలో జరిగింది. గణపవరం ఎస్ఐ ఏ.మణికుమార్ కథనం మేరకు ... వనమోజు పవన కుమార్ అనే వ్యక్తి స్తానిక బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. పవన్ కుమార్ మద్యపానం అలవాటు కారణంగా భార్యను ఇబ్బందులకు గురిచేయడంతో ఇద్దరూ తరుచూ గొడవపడేవారని స్థానికులు తెలిపారు. దీంతో భార్య కొంతకాలంగా దూరంగా ఉటుందని చెప్పారు. పవన్ కుమార్ తన భార్యని కాపురానికి ఫోన్ లో గొడవపడినట్లు తెలిపారు. సోమవారం రాత్రి 12 గంటలకు బస్టాండ్ సమీపంలోని ఒక షాపులో ఇనురాడ్డుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం తెలిసిందని చెప్పారు. సంఘటన స్థలాన్ని నిడమర్రు సిఐ నక్కా రజనీ కుమార్ గణపవరం ఎస్ఐ ఏ మణికుమార్ పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)