ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్యాన్సర్‌ లక్షణాలు ఉంటే ఆషాలకు తెలపండి : డాక్టర్ కిరణ్మయి

28 ఆగస్టు, 2026

Medical staff holding a rally
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 03:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి, గణపవరం: గణపవరం ఆరోగ్య కేంద్ర పరిదిలోగల స్థానికులకు గొంతు, గర్బాశయ, రొమ్ము క్యాన్సర్‌‌లకు సంబంధించిన లక్షణాలు ఉంటే ఆషా కార్యకర్తలకు తెలపాలని స్థానిక పిహెచ్ సి డాక్టర్ పి.కిరణ్మయి తెలిపారు. శుక్రవారం జరిగిన ప్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గోని స్థానికులకు అవగాహన కల్పించారు. క్యాన్సర్‌ ఉన్న వారిపేరు ప్రత్యేక ‌యాప్‌ లో నమోదు ‌చేసి వ్యాది లక్షణాలు బట్టి పైఆసుపత్రికి పంపుతామని చెప్పారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పరిశుభ్రత లేకపోతే దోమల వల్ల డేంగ్యూ, మలేరియా వంటి వ్యాదులు వస్తాయని అన్నారు. వ్యాదులపై అవగాహన కలిగి ఉంటే చికిన్ గున్యా, మలేరియా అరికట్టవచ్చునని తెలిపారు. క్లోరినేషన్ చేసిన నీటిని త్రాగటం వల్ల కొన్ని వ్యాదులు రాకుండా ఉంటాయని అన్నారు వ్యాదులపై ఇంటింటా సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ ఒ జాలాది విల్సన్ బాబు వైద్యసిబ్బంది పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్