సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్రమంగా బాణసంచా తయారీ.. వృద్ధుడి అరెస్ట్

19 సెప్టెంబర్, 2026

bombs.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 08:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - నరసాపురం: లైసెన్స్‌ లేకుండా ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తూ, పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన 68 ఏళ్ల వృద్ధుడిని మొగల్తూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలోని కోడివారి మెరకలో జక్కంశెట్టి సత్యనారాయణ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 6,825 తాటాకు బాంబులు, సుమారు 5 కిలోల పొటాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నరసాపురం రూరల్‌ సీఐ ఎం. నాగరాజు, మొగల్తూరు ఎస్‌ఐ జి. వాసు ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్