ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాలకొల్లు మున్సిపాలిటీ లో 44 కు 40 వార్డుల్లో మహిళలదే పై చేయి

1 గంట క్రితం

In Palakollu Municipality, women hold the upper hand in 40 out of 44 wards.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 03:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు మున్సిపాలిటీలో మొత్తం 77,478 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 40,279 మంది మహిళలు ఓటర్ల గా ఉండగా 37,191 మంది పురుషులు ఓటర్లు గా ఉన్నారు. 8 మంది నపుంసకులు ఓటర్లుగా నమోదు అయి ఉన్నారు.గతంలో వార్డుకు 2000 నుంచి 3000 వరకు ఓటర్లు ఉండగా ఇప్పుడు సరాసరి 1900 మంది వార్డుకు ఓటర్లు ఉండేటట్టు ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడిన 43 వ వార్డులో అత్యధికంగా 1990 మంది ఓటర్లు ఉన్నారు. 11 వ వార్డులో 1179 మంది,44లో 1975 మంది ఓటర్లు ఉన్నారు.ఇక 37 వ వార్డులో 1565 మందితో చిన్న వార్డుగా, తక్కువ ఓటర్లు ఉన్నారు, 34 వ వార్డులో 1573 మంది,37 లో 1565 మంది, 24 లో 1573 మంది తో ఓటర్లతో చిన్న వార్డు లుగా ఉన్నాయి. మొత్తం 44 వార్డుల్లో 40 వార్డుల్లో పురుషులు కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా 4 వార్డుల్లో పురుషులు ఎక్కువగా ఉన్నారు. 12వ వార్డులో 811 మంది పురుషులు ఉండగా 794 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. 15 వ వార్డులో 964 పు. ఉండగా 885 మంది మ. ఉన్నారు.16 లో 905 మంది పు, 885 మంది మ. ఉన్నారు. 41వ వార్డు లో 845 మంది పురుషులు,839 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్