పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లులో పాల ప్యాకెట్ ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపు అన్ని రకాల ప్యాకెట్ల ధరలు సెప్టెంబర్ 1 నుంచి పెరిగాయి. ఇప్పటికే అర లీటరు పాల ప్యాకెట్ ధర రూ.36 నుంచి రూ.38 వరకు ఉన్నాయి. అయితే ఈ రోజు నుంచి సంగం, విజయ డైరీ పాల ప్యాకెట్లు కూడా రూ.36 నుంచి రూ.38 కి పెరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ, తిరుమల, హెరిటేజ్ పాల ప్యాకెట్ ధరలు రూ.38 గా ఉన్నాయి. దీంతో ఉదయం పూట కనీసం టీ తాగలేని పరిస్థితిలో కార్మికులు సామాన్యులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.
పెరిగిన పాల ప్యాకెట్ ధరలు
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 03:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)