ప్రజాశక్తి - పాలకోడేరు (పశ్చిమ గోదావరి) : ప్రభుత్వం విధించిన నిబంధనలతో మానసిక క్షోభ ఎదుర్కొంటున్నామని మండల రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకోడేరు తాసిల్దార్ కార్యాలయం వద్ద మండలం లోని రేషన్ డీలర్లు మంగళవారం మెరుపు ధర్నా నిర్వహించారు. రేషన్ షాపులో ప్రతి బియ్యం బస్తా క్యూఆర్ కోడ్ చేయాలన్న ప్రభుత్వ నిబంధనలు దారుణమన్నారు. తమకు ఇస్తున్న కిలో బియ్యానికి రూపాయి కమిషన్ ను రూ. 3 కు పెంచాలన్నారు. ప్రభుత్వ నిబంధనల వల్ల తాము మానసిక క్షోభ అనుభవిస్తున్నామని, పని భారం పెరిగిపోయిందని, తమకు వాహనాలు గానీ, నిర్వహణా ఖర్చులు గాని ఎలాంటి ప్రతిఫలం ఇవ్వకుండా వృద్ధులకు ఇంటింటికి రేషన్ పంపిణీ సేవ పేరుతో బలవంతంగా చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ పి వి. ఎన్. ఎస్.ఎస్. లక్ష్మీ సమర్పించారు. సమస్యలను ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చారు. మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దొంగ కృష్ణ, సెక్రెటరీ సోము సాయి రామకృష్ణ, కోశాధికారి కొల్లా సత్యనారాయణ, కె ఎన్ ఆర్ ఆంజనేయులు, కుమార్, విజయరత్నం, ఉషా, సుజాత, నాగలక్ష్మి, వరలక్ష్మి, పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనలతో మానసిక క్షోభ - రేషన్ డీలర్ల ధర్నా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 03:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)