- బాబయ్యస్వామి భక్తులకు మంత్రి అన్నదానం
ప్రజాశక్తి-పెనుకొండ : పట్టణంలో ప్రసిద్ధి చెందిన బాబయ్యస్వామి 754వ ఉరుసు మహోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆదివారం మంత్రి సవిత అన్నదానం ఏర్పాటు చేశారు. 15 ఏళ్లుగా బాబయ్యస్వామి ఉరుసు సందర్భంగా పట్టణంలోని పెట్రోల్ బంకు వద్ద భక్తులకు మంత్రి అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది ఉరుసు మహోత్సవానికి వచ్చిన భక్తులకు భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ త్రివేంద్రమూర్తి, పట్టణ కన్వీనర్ శ్రీరాములు యాదవ్, కౌన్సిలర్లు బాబుల్ రెడ్డి, షౌకత్, హుజూర్లఖాన్, సమి, బర్కత్, కృష్ణమూర్తి, రామలింగ, హరి, అశ్వర్థనారాయణ, హనుమంతు, రవికుమార్, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)