ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికా చర్యలు ‘దురుద్దేశపూరితమైనవి’ : చైనా వాణిజ్యశాఖ

54 నిమిషాల క్రితం

china.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 05:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బీజింగ్‌ : తమ దిగ్గజ టెలికాం సంస్థలు అమెరికా ఫోన్‌ నెంబర్లను నేరుగా పొందడాన్ని నిలిపివేసేలా వైట్‌హౌస్‌ ఇటీవల తీసుకున్న చర్యలను వాణిజ్య శాఖ ఖండించింది. ఈ చర్యలను ‘దురుద్దేశపూరితమైనవి’ గా అభివర్ణించింది. ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ (ఎఫ్‌సిసి) గురువారం ఓటింగ్‌ ద్వారా ఈ ఉత్వుర్వులను ఆమోదించింది. ‘‘చట్టవిరుద్ధమైన స్కామ్‌ కాల్స్‌ (రోబోకాల్స్‌ ) ప్రచారాలకు’’ బాధ్యులైన వారికి అమెరికా ఫోన్‌ నెంబర్ల ప్రాప్యతను అరికట్టడమే ఈ ఉత్తర్వుల లక్ష్యమని పేర్కొంది. ఈ ఉత్తర్వులతో ప్రధానంగా ప్రభుత్వ యాజమాన్యంలోని మూడు అత్యున్నత టెలికాం సంస్థలు చైనా యూనికామ్‌, చైనా టెలికామ్‌, చైనా మొబైల్‌లు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఎటువంటి వాస్తవిక ఆధారం లేకుండా, చైనా టెలికమ్యూనికేషన్స్ సంస్థలపై ఇష్టానుసారంగా బురద చల్లడానికి, దురుద్దేశపూర్వకంగా అణచివేయడానికి (ఎఫ్‌సిసి) ఈ చర్యలు చేపట్టిందని, వివక్షారహిత, నిష్పక్షపాత పోటీ నిబంధనలను ఉల్లంఘించిందని చైనా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల షెన్‌జెన్‌లో జరిగిన ప్రాంతీయ సదస్సులో అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య కుదిరిన ఏకాభిప్రాయానికి ఎఫ్‌సిసి చర్యలు విరుద్ధంగా ఉన్నాయని ఆ ప్రకటన పేర్కొంది. టెలికాం రంగాలను వేరుచేసే ఇటువంటి ప్రయత్నాలు ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది. ఆ చర్యలను రద్దు చేయాలని సూచించింది. అలాగే తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని చైనా స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్