సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కేరళలోని కోజికూడ్ లో సదస్సుకు పాలకొల్లు ప్రతినిధులు హాజరు

05 ఆగస్టు, 2026

lic agents
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 04:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు ఎల్ఐసి ఏఓఐ ఆధ్వర్యంలో కేరళ లోని కుజికోడ్ లో జరుగుతున్న 7వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఏజెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, పాలసీదారులకు బోనస్ లు పెంచడం, ఏజెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచి, వారు పనిచేస్తున్నంతకాలం జీవిత బీమా, ఆరోగ్య భీమా కల్పించాలని కోరుతున్నారు . ఎల్ఐసి సంస్థను నిర్వీర్యం చేసి, కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా మోడీ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు. ఏజెంట్లను, సంస్థను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ సమావేశంలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే విధంగా కృషి చేస్తామని హాజరైన ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశానికి పాలకొల్లు ఎల్ఐసి ఏవోఐ బ్రాంచ్ అధ్యక్షులు గుడాల బాలాజీ, ఏ పి స్టేట్ ప్రెసిడెంట్ తొట్టెంపూడి కోటేశ్వరరావు, డివిజనల్ జనరల్ సెక్రటరీ బళ్ల రమేష్ కుమార్, మామిడిశెట్టి రాధ హాజరయ్యారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్