పాలకొల్లు (పాలకొల్లు) : పిల్లల ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి స్టీల్ బాక్సులు వాడాలని సీనియర్ సర్జన్ డా జగ్గురోతు స్వరూప్ చెప్పారు. పాలకొల్లు పట్టణంలోని GVSVRM మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో ఈనెల 24 న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మెగా టీచర్స్ మీటింగ్" కు హాజరయ్యే తల్లిదండ్రులకు రూ 5600/-విలువచేసే స్టీల్ కేరియర్ లను సోమవారం డా స్వరూప్ హెచ్ ఎం రాయపూడి భవానీ ప్రసాద్ కు అందించారు. మంచి ఆహారం, అలవాట్లతోనే స్వర్ణాంధ్ర సాధ్యం" అని తెలిపారు. పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ సహకరించి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమానికి ఇంకా సహకరిస్తున్న దాతలు దేవ గానుగుల వరలక్ష్మి, బాలి ఏడుకొండలు కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, నందిని, లీల కుమారి పాల్గొన్నారు.
పిల్లల ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి : డాక్టర్ స్వరూప్
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 04:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)