మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తూతు మంత్రంగా రోడ్డు మరమ్మతులు

1 గంట క్రితం

Road repairs carried out in a perfunctory manner.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 01:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అభివృద్ధికి నోచుకోని గణపవరం బస్టాండ్

స్తానిక ఎం ఎల్ ఏ ద్రుష్టి పెట్టడం లేదని విమర్శలు

సెప్టిక్ టేంకులో నీరుని దారిలోపోయటంవలన దుర్వాసన

గణపవరం పోటోలు సెప్టిక్ టేంకులో నీరు నిలిచిన పోపో

రాళ్ళులేచిపోయిన రహదారి


ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : రెండు మండలాకి కేంద్రంగా ఉన్న గణపవరం బస్టాండ్ అభివృద్ధి కి నోచుకోలేదని చెప్పాలి. బస్టాండ్ నిర్మాణం చేసి సంవత్సరాలు గడిచిన బస్టాండ్ అభివృద్ధి చెందలేదు బస్టాండ్ లో వేసిన రహదారి గోతులు పడి వాహనాలు రాకపోకలు కు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా పలు పత్రికలలో బస్టాండ్ సమస్య ప్రచురించగా హడావుడి గా అధికారులు బస్టాండ్ లో ఉన్న గోతులలో నల్లకంకరు వేసి రోడ్డురోలరుతో చదునుచేసి చేతులు దులుపుకొన్నారు అయితే వేసిన రహాదాలో రాళ్ళు తొలగిపోయి బురద స్తాయికి చేరుకుంది దీంతో పాటు బస్టాండ్ లో పరిశుభ్రత లోపించింది బస్టాండ్ లో ఉన్న స్వీపరు ప్రతిరొజు ఉదయం సెప్టిక్ టేంకులో ఉన్న నీటిని బకీట్ తో తోడి బస్సులు వచ్చే దారిలో పోయటంవలన దానినుండి వచ్చే దుర్వాసనకు ప్రయణీకులు నాన అవస్థలు పడుతున్నారు బస్టాండ్ కి వారానికి నెలకి ఒకసారి ఆర్టిసీ అధికారులు వచ్చి చూచివెళ్ళటం తప్ప సమస్యలపై దృష్టి పెట్టడంలేదని ప్రయానణీకులు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక శాసన సభ్యులు పత్సమట్ల దర్మరాజు బస్టాండ్ అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిదని ప్రయాణీకులు అంటున్నారు జిల్లా లో ఉండి పాలకొల్లు భీమవరం కి చెందిన శాసన సభ్యులు బస్టాండ్ ల అభివృద్ధి కి కృషి చేస్తున్నారని ఉంగుటూరు శాసన సభ్యులు కూడా గణపవరం బస్టాండ్ అభివృద్ధి కి కృషి చేయాలని కోరుతున్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్