న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ కు బలంగా తగిలింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన న్యూఢిల్లీ టైగర్స్, ఈస్ట్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌లో లక్ష్య తరేజా అనే బ్యాటర్ పవర్‌ఫుల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడారు. ఆ బంతి కాస్త మెయిన్ అంపైర్‌గా ధర్మేశ్ భరద్వాజ్ చెవి భాగంలో బలంగా తాకింది. అంపైర్ అప్రమత్తమై కిందికి వంగినప్పటికీ బంతి నుంచి తప్పించుకోలేకపోయాడు. వెంటనే అంపైర్‌ను పరీక్షించిన ఫిజియోలు మైదానం నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే ఈ అంపైర్‌కు మైదానంలో బంతి తాకడం ఇదే తొలిసారి కాదు. ఇదే సీజన్ ఆరంభంలో మరో బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ అతని భుజానికి బలంగా తాకింది. కానీ ఆ సమయంలో పెద్ద గాయం కాలేదు. అంపైర్‌ను గాయపర్చిన లక్ష్య తరేజా 25 బంతుల్లో ఫోర్‌తో 21 పరుగులు చేశారు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'పాపం అంపైర్' అంటూ సానుభూతి చూపిస్తున్నారు. అంపైర్లు కూడా హెల్మెట్‌లు వాడాలని, టీ 20 ఫార్మాట్‌లో తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు.
https://www.instagram.com/reel/DcJDeleyZ12/?utm_source=ig_web_button_share_sheet
Video - బలంగా తగిలిన బంతి.. ఐసియులో అంపైర్ ..!
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)