న్యూఢిల్లీ : ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుల్లో ప్రత్యేక, కాలవ్యవధితో కూడిన దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పి.ఎస్.నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. పేపర్ లీకేజీలకు పాల్పడిన నిందితులు, వారి కుటుంబసభ్యుల ఆస్తిని స్వాధీనం చేసుకునే విధంగా ఆదేశాలివ్వాలని పిటిషన్ కోరింది. అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టం, బినామీ, బ్లాక్ మనీ చట్టాలతో పాటు సంబంధిత చట్టాల కింద దర్యాప్తు చేపట్టాలని కోరారు.
పేపర్ లీక్ పిటిషన్‌పై కేంద్రప్రభుత్వ స్పందన కోరిన సుప్రీంకోర్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 01:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)