మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Markets - నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ..!

1 గంట క్రితం

Domestic stock markets in the red..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 01:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు, కీలక రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ప్రభావంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభ సమయానికి సెన్సెక్స్‌ 249 పాయింట్లు (0.32 శాతం) నష్టపోయి 77,479.16 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50.70 పాయింట్లు (0.21 శాతం) క్షీణించి 24,236.95 వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ ప్రారంభమైనప్పటి నుంచి రెండు సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. మరోవైపు మార్కెట్‌ ఒత్తిడిలో ఉన్నప్పటికీ కొన్ని కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. వెల్‌స్పన్‌ లివింగ్‌ లిమిటెడ్‌, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, యాక్షన్‌ కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. ఇక కోల్గేట్‌-పామోలివ్‌ (ఇండియా) లిమిటెడ్‌, లోధా డెవలపర్స్‌ లిమిటెడ్‌, బిలియన్‌ బ్రెయిన్స్‌ గ్యారేజ్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో మార్కెట్‌ సూచీలపై ఒత్తిడి కొనసాగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్