నరసాపురం (పశ్చిమ గోదావరి) : సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు బుధవారం సిఐ నాగరాజు వెల్లడించారు. కాకినాడ నుంచి ఐదు రోజుల క్రితం సోనా బోటులో ఏడుగురు మత్స్యకారులు సముద్ర వేటకు బయలుదేరారు. మంగళవారం ప్రమాదవశాత్తు వారి బోటు నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ పరిధిలోని చినమైనవాని లంక ఇసుక దిబ్బల వద్ద సముద్ర తీరం సమీపంలో చిక్కుకుపోయింది. బోటును రక్షించేందుకు మరో బోటు అక్కడికి చేరుకున్నప్పటికీ, ఆ బోటుకు కూడా మరమ్మతు అవసరం కావడంతో వెనుదిరిగింది. దీంతో సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల పరిస్థితిపై సమాచారం అధికారులకు చేరింది. సమాచారం అందుకున్న నరసాపురం రూరల్ సిఐ ఎం.నాగరాజు, ఎస్‌ఐ కె.శారదా సతీష్ వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. వారి ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలతో బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితం
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 26, 2026, 01:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)