బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజస్థాన్‌ హైకోర్టు ఎసిజెపై జస్టిస్‌ మెహతా తీవ్ర ఆరోపణలు

1 గంట క్రితం

justice mehta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 04:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : రాజస్థాన్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఎసిజె) జస్టిస్‌ సంజీవ్‌ ప్రకాశ్‌ శర్మపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ సందీప్‌ మెహతా తీవ్ర ఆరోపణలు చేశారు. పక్షపాతం, అవినీతి, అక్రమాలు, బంధుప్రీతికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, ఎసిజెను బదిలీ చేయాలంటూ తాను చేసిన విజ్ఞప్తులను ఎందుకు పట్టించుకోలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ను ప్రశ్నిస్తూ ఆగస్టులో మూడు లేఖలు రాశారు. రాజస్థాన్‌ హైకోర్టులో న్యాయ, పరిపాలనా వ్యవహారాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని జస్టిస్‌ మెహతా ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండా కేసులను ఉపసంహరించి ఎసిజె బెంచ్‌కు బదిలీ చేస్తున్నారని తెలిపారు. ఎసిజె వ్యక్తిగత కక్షతో న్యాయాధికారులను పిలిపించి అవమానిస్తున్నారని పేర్కొన్నారు. తనకు అనుకూలమైన న్యాయవాదులను పెద్ద సంఖ్యలో సీనియర్లుగా నియమించేందుకు పూర్తి కోర్టు సమావేశం నిర్వహించారని, దాదాపు 100 గదులతో కూడిన అతిథి గృహ టవర్‌ నిర్మాణానికి కల్పిత ప్రణాళిక రూపొందించడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని విమర్శించారు. ఎసిజె బదిలీ వంటి ప్రతీకార చర్యలతో జడ్జిలను బెదిరిస్తున్నారని తనకు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ఆగస్టు 17న రాసిన చివరి లేఖలో ఎసిజిపై ‘బంధుప్రీతి, పక్షపాతం’ ఆరోపణలు చేశారు. రాజస్థాన్‌ హైకోర్టుకు మరో రాష్ట్రానికి చెందిన రెగ్యులర్‌ ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని తాను పదేపదే కోరుతున్నప్పటికీ, ఆ విజ్ఞప్తిని విస్మరించడం సంస్థ ప్రయోజనాలకు విరుద్ధమని జస్టిస్‌ మెహతా పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్