బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉమ్మడి తూ.గో. జిల్లా స్థాయి కథల పోటీ విజేతలు వీరే

1 గంట క్రితం

Here are the winners of the short story competition at the level of the undivided East Godavari district.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 03:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆగస్టు 29న ఆలమూరు జూనియర్ కళాశాలలో జరిగే తెలుగు భాషా దినోత్సవం వేదికగా బహుమతులు అందజేత


ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : శ్రీమతి అంగర లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ, బాల మందిరం ఆధ్వర్యంలో ఆగస్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం, వ్యవహారిక భాషా ఉద్యమకారులు గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి కథల పోటీకి రచయితల నుంచి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు అంగర గోపాలకృష్ణాచార్యులు(కృష్ణశ్రీ) బుధవారం తెలిపారు. విజేతల వివరాలను ఆయన వెల్లడించారు.


ప్రథమ బహుమతి

డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మానేపల్లి కి చెందిన రచయిత కె.వి.లక్ష్మణరావు రచించిన 'మార్పు మొదలైంది' కథకు....


ద్వితీయ బహుమతి

తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన రచయిత డాక్టర్ చల్లా రవికుమార్ రాసిన"మనుషులు పోగొట్టుకున్న మనిషి" కథకు...


తృతీయ బహుమతి

కాకినాడ జిల్లా పెదపూడి మండలం కరకుదురు కు చెందిన రచయిత్రి వరలక్ష్మి నున్న రాసిన "అమ్మ నాన్నకు ప్రేమతో " కు... లభించాయని తెలిపారు.


కన్సోలేషన్ బహుమతి

ఆలమూరుకు చెందిన కధా రచయిత ఆకుల సూర్యా రాసిన "రక్షా బంధనం" కథ కన్సోలేషన్ బహుమతిని సాధించిందన్నారు.


ఎంపికైన నాలుగు కథలతో సహా పోటీలకు వచ్చిన వాటిలో మంచి కథలతో గోదావరి అనుబంధం కథలు - 2027 కథాసంపుటిని త్వరలో ప్రచురించనున్నామని కృష్ణశ్రీ తెలిపారు. విజేతలైన కథా రచయితలకు ఈ నెల 29 శనివారం సాయంత్రం 3 గంటలకు ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న తెలుగు భాషాదినోత్సవం సభలో బహుమతులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్