బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కలుషిత తాగునీరు.. పక్కనే డ్రైనేజీ.. పేరుకుపోతున్న చెత్త..

1 గంట క్రితం

Contaminated drinking water... a drain right next to it... accumulating garbage...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 03:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ద్రాక్షారామ 5వ వార్డ్ లో సమస్యలు


ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : ద్రాక్షారామ ఐదో వార్డు లో గత 20 రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుందని యండమూరి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నరాల ఏడుకొండలు ఇంటి పక్కన గల ఈ కుళాయిలో డ్రైనేజీ నీరు కలిసిపోయి దుర్వాసన వెదజల్లుతూ తాగడానికి ఇబ్బందులు పడుతున్నామని , తాగునీటిలో డ్రైనేజీనేర్ కలవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులకు చెప్పిన సమస్య నేటికీ పరిష్కారం కాలేదు అన్నారు. ఇక్కడ మంచినీటి కొళాయిని ఆనుకుని డ్రైనేజీ ఉందని వర్షం వస్తే ఈ డ్రైనేజీ నీరు రోడ్లపై కూడా వస్తుందని వివరించారు. ఇక ఈ వీధిలో చెత్త పెద్ద ఎత్తున పేరుకుపోయిందని దాన్ని శుభ్రం చేసిన దాఖలాలు కూడా లేవన్నారు. దీనిపై అధికారులు కు ఫిర్యాదు చేశామన్నారు. కుళాయి నీళ్లు పట్టుకునే ప్లాట్ ఫారం మొత్తం తవ్వేశారని దీంతో నీళ్లు పట్టుకునేందుకు కూడా ఈ కుళాయి వద్ద వీలు లేకుండా పోయిందన్నారు. అధికారులు వెంటనే స్పందించి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని డ్రైనేజీ నీరు కొలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని, కుళాయిలో నీరు పట్టుకునేందుకు ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని, వీధిలో పేరుకుపోయిన చెత్తాచెదారం వెంటనే శుభ్రం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై గ్రామ కార్యదర్శి వివరణ ద్రాక్షారామ పంచాయతీలోని ఐదో వార్డులో తాగునీరు కలుషితంపై గ్రామ కార్యదర్శి పెట్ట సత్యనారాయణ ను వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందని దీనిపై నీరు డ్రైనేజీలో ఎక్కడ కలుస్తుందో పరిశీలిస్తున్నామన్నారు. రెండు మూడు చోట్ల ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు నీరు శాంపిల్స్ పంపించామని ఎక్కడ కొలుషితం అవుతుందో పరిశీలించి అక్కడ కొత్త పైపులైన్లు వేస్తా వేస్తామన్నారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రజాశక్తికి వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్