ప్రజాశక్తి-పెనుగొండ (పశ్చిమ గోదావరి జిల్లా) : నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ 24 వ తేదీ రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.ఈశ్వర్, డి.వై.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు ఎస్. వి. ఎన్ శర్మ లు ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండలోని స్థానిక ఎస్.వి.కే.పి కళాశాలల క్యాంపస్ వద్ద బంద్ పోస్టర్లను విద్యార్థులతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ మండల నాయకులు కే.సాయి, కే.ప్రభాకర్,విజయ్, ఆర్.విజయ్,దేవేంద్ర, ఎస్. కె ఖలీఫ్, ఎస్.చింటూ, ఎన్.నాని తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 24 న రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ : ఎస్ఎఫ్ఐ
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 04:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)